రామాయంపేట రూరల్, మార్చి 14: చిరుత దాడిలో రెండు దూడలు చనిపోయిన ఘటన రామాయంపేట మండలం దంతేపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైతు నక్కిర్తి స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తన పొలంవద్ద పశువులను కొట్టంలో కట్టేసి ఇంటికి వచ్చినట్లు తెలిపారు.
ఉదయం వెళ్లి చూడగా రెండు దూడలు చనిపోయినట్లు తెలిపారు. చిరుత దాడి వల్లే దూడలు చనిపోయాయని తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రాత్రి వేళల్లో రైతులు పంట పొలాల వద్దకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.