నిజాంపేట,మే1 : నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి. బీటీ రోడ్డు నిర్మాణం కోసం నస్కల్ గ్రామస్తులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేసిన రిలే నిరాహర దీక్షలకు ఫలితం దక్కింది. సదరు కాంట్రాక్టర్ మొదటగా నస్కల్ గ్రామం వైపు దారిలో తారు పనులను ప్రారంభించారు. మట్టి రోడ్డు స్థానంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Naga Chaitanya | పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదో తరగతిలో స్కూల్ టాపర్
Bunny Vas | దాని మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. కాని ఎందుకు ఈ గొడవలు అంటున్న బన్నీ వాసు