Bunny Vasu | అల్లు కాంపౌండ్ సపోర్ట్‌తో నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు బన్నీ వాసు. నిర్మాతగా ఆయన తీసే సినిమాలకి ప్రేక్షకాదరణ బాగానే ఉంటుంది. ఇక సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన చేసే కామెంట్స్ కొన్ని వివాదాస్పదం కూడా అవుతుంటాయి. తాజాగా బన్నీ వాసు శాంతి సందేశం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తన సోషల్ మీడియా పేజ్‌లో బన్నీ వాసు.. ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని అనిపిస్తుంది. కాని ఇప్పుడు ఎందుకీ గొడవలు . శాంతి.. శాంతి.. శాంతి..!’ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన దేనిపై తన అసహనాన్ని వెళ్లగక్కారనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
బన్నీ వాస్ ఏ అంశంపై ఇలాంటి కామెంట్ చేశారా అనే దానిపై చర్చ నడుస్తుంది.. అయితే.. ఇటీవల సింగిల్ ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ వివాదానికి దారి తీయగా.. దీనిపైనే ఆయన పోస్ట్ పెట్టారని కొందరు ముచ్చటించుకుంటున్నారు. సింగిల్ మూవీ డైలాగ్ వివాదం ఏంటంటే… ట్రైలర్లో.. శ్రీవిష్ణు ‘శివయ్యా..’ అని అరుస్తూ ఉంటాడు. దానిపై విష్ణు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపించింది. అందుకు కారణం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్లో ఆయన శివయ్య అని గట్టిగా అరిచారు. దానిపై తెగ ట్రోలింగ్ నడిచింది. దానిని బేస్ చేసుకొనే సింగిల్’ ట్రైలర్లోనూ శ్రీ విష్ణు ‘శివయ్యా’ అంటూ వెటకారం చేసేలా అరవడం , ట్రైలర్ చివర్లో ‘మంచు కురిసిపోతుందని’ అంటూ శ్రీవిష్ణు డైలాగ్ చెప్పడం కూడా కొంత వివాదాస్పదం అయింది.
వివాదం ముదురుతుంది అనుకున్న సమయంలో శ్రీ విష్ణు వీడియో విడుదల చేస్తూ.. కన్నప్ప టీమ్ మేము వాడిన డైలాగ్స్ కి హార్ట్ అయ్యారని తెలిసింది. అది కావాలని చేసింది కాదు. తప్పుగా కన్వే కావడంతో వెంటనే మేము స్పందించి ఆ డైలాగ్స్ తీసేస్తున్నాము. ఆ డైలాగ్స్ సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. ప్రజెంట్ జనరేషన్ వాడే సినిమా రిఫరెన్స్ లు, మీమ్స్ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అరవింద్ గార్ల డైలాగ్స్ కూడా వాడాము. ఒక పాజిటివ్ గానే కామెడిగానే ఇవన్నీ చేసాము. అలాంటివి మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ అని అన్నాడు.