జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించింది. అప్పట్లో కొన్ని పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిశ్రమల స్థాపన నిలిచిపోయింది. పరిశ్రమలను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో తమ భూములను తమకు ఇవ్వాలని ఆయా గ్రామాల్లోని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని జిన్నారం, జంగంపేట, మంగంపేట, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని అల్లీనగర్, వావిలాల గ్రామాల్లో వందల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. రసాయన రహిత పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమల ఏర్పాటుతో తమకు ఉపాధి లభిస్తుందని చేస్తే గ్రామాల్లోని యువత, నిరుద్యోగులు ఆనందపడ్డారు.
కానీ, ఏమైందో ఏమో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. ప్రస్తుతం పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పరిశ్రమల స్థాపన నిలిచిపోయింది. దీంతో యువత ఆశలు అడియాసలు గానే మిగిలాయి. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకుని యాజమాన్యాలు స్వాధీనం చేసుకున్నాయి. కానీ, పరిశ్రమలను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు కాకుండా యాజమాన్యాలు భూములను స్వాధీనం చేసుకుంటుడడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఓఆర్ఆర్కు సమీపంలో ఈ భూములు ఉండటంతో ఇక్కడి భూములకు భారీ డిమాండ్ ఉంది. దీంతో యాజమాన్యాలు భూములను స్వాధీనం చేసుకొని, ఇతరులకు విక్రయాలు జరుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భూముల కేటాయింపు జరిపి ఏండ్లు గడుస్తున్నా పరిశ్రమలను తీసుకురాక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు, యువత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భూముల కేటాయింపు వివరాలు..