సదాశివపేట, ఏప్రిల్ 17: ఈనెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు గులాబీ దండు వేలాదిగా తరలివచ్చి కదంతొక్కాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సదాశివపేటలో రజతోత్సవ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ను ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, శివరాజ్‌పాటిల్, శ్రీనివాస్‌నాయక్, విద్యాసాగర్‌రెడ్డి, ముబీన్ మోహినోద్దిన్, నసీర్బాయ్, సత్యం, సాతాని శ్రీశైలం, శ్రీధర్‌రెడ్డి, కోడూరి అంజన్న, చౌదరి ప్రకాశ్, రాజు, విజయ్‌కుమార్, బరాడిసాయి, బోడపల్లి అవినాశ్, దిడిగె నగేశ్ పాల్గొన్నారు.
కంది, ఏప్రిల్ 17: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సంగారెడ్డిలో చలో వరంగల్ వాల్ పెయింటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామగ్రామాన సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లు అతికించాలని పార్టీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, కొండల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
జగదేవపూర్ ఏప్రిల్17: ఊరూవాడ కదులుదాం.. ఎల్కతుర్తి సభకు తరలుదామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జగదేవపూర్ కేశిరెడ్డి ఫంక్షన్‌హాలులో నిర్వహించిన వరంగల్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25ఏండ్లు అవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారన్నారు. మార్పు రావాలి, మార్పు రావాలి అంటే కాంగ్రెస్ వచ్చింది. కానీ పేదల గుండెల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు.
పదేండ్లు అధికారంలో లేకపోయేసరికి అధికారంలోకి వచ్చిననాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని మరచి అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడానికి ఎగపడ్డారని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం కాయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు.
రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు వస్తారనే భయంతో ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల్లో ఒణుకుపుడుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత, జగదేవపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగరాజు, యాదవరెడ్డి, మాజీ సర్పంచులు నరేశ్, యాదవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్లు ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, నాయకులు కనకయ్య, చంద్రం, ఆయా గ్రామాల అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 17: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన చిన్నశంకరంపేటలో వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన వాల్‌రైటింగ్ రాశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఏర్పడి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయడం లేదని, అర్హతలు ఉన్న రైతులకు రుణమాఫీ, రైతుభరోసా ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ సీఎం కావాని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మెదక్ నియోజకవర్గం నుంచి వరంగల్ సభకు తరలివెళ్లేందుకు ప్రజలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ మాజీ కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ మామిండ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు, బీఆర్ఎస్ చిన్నశంకరంపేట పట్టణ అధ్యక్షుడు హేమ చంద్రం, మాజీ సర్పంచ్ రమేశ్, నరేశ్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం కావడంతో మరోసారి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని జేపీ కాలనీతోపాటు బండ్లగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లా డి, గోడలపై వాల్ రైటింగ్ రాశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు స్వచ్ఛందగా వరంగల్‌లో నిర్వహించే సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజ లు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుతున్నారని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సబ్బండ వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పుట్టిందని తెలిపారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశం మొత్తం వరంగల్ సభ వైపు చూస్తుందని, బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రచారం చేస్తున్నామన్నారు.
బండ్లగూడ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా భరత్‌ను ఏక్రగీవంగా ఎన్నకున్నామని నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి తెలిపారు. వరంగల్ సభను విజయవంతం చేయడంతోపాటు బండ్లగూడలో పార్టీని బలోపేత్తం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బడ్లగూడ నుంచి వరంగల్ సభకు భారీగా ప్రజలను తరలించేందు కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశం గౌడ్, నాయకులు శ్రీధర్ చారి, మాణిక్‌యాదవ్, నవీన్, రామకృష్ణ, సాయి, జానీ పాల్గొన్నారు.