మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 16: తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిర్భవించినట్లు తెలిపారు. 25 ఏండ్లలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు చూసిందన్నారు.
సాధించుకున్న తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ కోసం అనునిత్యం తపించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, అందుకోసమే బీఆర్ఎస్ను ప్రజలు తమ ఇంటి పార్టీగా అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు. 2001 నుంచి బీఆర్ఎస్లో పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షురాలు చొప్పరి వరలక్ష్మీసాగర్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు ఆకుల యాదగిరి, గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ, సీనియర్ నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, తాళ్లపల్లి భిక్షపతి, నాచగోని వెంకట్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు గోనెపల్లి మల్లేశం, యూత్ మండల అధ్యక్షుడు బడుగు సాయిలు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.