సంగారెడ్డి, ఏప్రిల్ 10: ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లానుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బీజేపీ, కాంగ్రెస్‌కు నిద్రపట్టడం లేదన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, సీఎం రేవంత్ స్వల్పకాలంలో ప్రజాభిమానాన్ని కోల్పోయారని అన్నారు. తెలంగాణకు మళ్లీ మంచిరోజులు రావాలంటే కేసీఆర్ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని గుర్తుచేశారు. సభకు గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకులు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింహులు, నాయకులు విజయేందర్‌రెడ్డి, రాజేందర్, చక్రపాణి, మాజీ జడ్పీటీసీలు కొండల్‌రెడ్డి, మనోహర్‌గౌడ్, డా.శ్రీహరి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.