నమస్తే తెలంగాణ నెట్వర్క్,ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌ను జిల్లా నేతలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, పట్లోల్ల శశిధర్‌రెడ్డి, మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఫరూఖ్హుస్సేన్, వంటేరి యాదవరెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, వెంకట్రామిరెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, రాధాకృష్ణశర్మ, రోజారాధకృష్ణశర్మ, ఇతర నేతలు కలిశారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అధినేత ఆదేశించారని నేతలు తెలిపారు.

