సిద్దిపేట, సెప్టెంబర్ 16: తెలంగాణకు రాజీవ్‌గాంధీకి సంబంధమేందని, ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పా టు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మేర్గు మహేశ్‌రెడ్డి యాదగిరి, కంకటి నవీన్‌గౌడ్ అన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్ర హం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సమా జం యావత్తు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టవద్దన్నా, ప్రభుత్వం మొం డిగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహం, తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని పెట్టాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల మెప్పు కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక కూల్చివేయక తప్పదన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, శ్రీకాంత్, అరవింద్‌రెడ్డి, గుజ్జ రాజు, శ్రీనివాస్, బైండ్ల శ్రీనివాస్, ఆనంద్, భాను, రాజశేఖర్, అశోక్, రాకేశ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.