BRS Rajatotsava Sabha | రామాయంపేట, ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సును ఓ లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటన రామాయంపేటలో జరిగింది. వివరాలలోకి వెళితే బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్తున్న బస్సు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రం నుండి మెదక్ మీదుగా రామాయంపేట నుండి సిద్దిపేట రోడ్డుకు చేరుకుంది.
అయితే రామాయంపేటలో మూలమలుపు వద్ద డ్రైవర్ లారీని వెనుకకు యూటర్న్ చేస్తుండగా బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దం సైడ్కు పగిలిపోయి పాక్షికంగా ద్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎల్కతుర్తి వెళ్లే బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని.. బస్సును ఢీకొట్టిన డ్రైవర్ను విచారణ చేపట్టాడు.
ఎల్కతుర్తి వెళ్లేందుకు బస్సులో ఉన్న రాయికోడ్ బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనతో ఎల్కతుర్తి వెళ్లలేక రామాయంపేటలోనే ఉండిపోయారు. తాము కేసీఆర్ ప్రసంగం వినేందుకే సభకు వెళ్తున్నామని మార్గమద్యంలో ప్రమాదం జరుగడం మా దురదృష్టమని బీఆర్ఎస్ నాయకులు వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి