Siddipeta | రాయపోల్, జులై 11 : రాయపోల్ మండల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మానసను శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రాయపోలు మండల శాంతి భద్రతలకు కోసం ప్రజల అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని పార్టీల నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యులు రంగారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజుగౌడ్, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, నవీన్ గౌడ్, మురళీ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు స్వామి, మాజీ వార్డ్ మెంబర్ రాజు గౌడ్, ప్రకాష్, స్వామి, అక్బర్, రాజు, కనకయ్య, సంతోష్, బ్యాగారి స్వామి, ఇసాక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.