కొమురవెల్లి, ఫిబ్రవరి 3: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం కరీంనగర్‌కు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితను కొమురవెల్లి కమాన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కలిసి మల్లికార్జున స్వామి కండువా కప్పి ప్రసాదంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప కుమారుడు అజయ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సార్ల కిష్టయ్య, ముత్యం నర్సింహులు గౌడ్, గొల్లపల్లి కిష్టయ్య, కొమురవెల్లి మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీధర్, ఏర్పుల మహేశ్, గొల్లపల్లి ఆంజనేయులు, బుడిగె రమేశ్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సిలివేరు కనకమల్లేశం, బుడిగె గిరికుమార్, విరాట్బాబు తదితరులు ఉన్నారు.