శివ్వంపేట, సెప్టెంబర్ 27 : కాంగ్రెస్ నాయకులు మాటిమాటికి బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మెద క్ జిల్లా శివ్వంపేట మండలంలోని గోమారంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తే స్థానిక కాం గ్రెస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారన్నా రు. దాడులకు ప్రతిదాడులు చేసే నైజం మా పార్టీకి లేదన్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని మదన్‌రెడ్డి పెట్టిన భిక్ష అని అనడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్, ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచిందని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్ ఇచ్చిందే బీఆర్ఎస్ అని గుర్తించుకోవాలన్నారు. పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గౌరవాన్ని పాతరేశారని, భూదందాలు చేసుకునే నాయకులు కూడా ఎమ్మెల్యేను విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్ను విమర్శిస్తే సహించేదిలేదన్నారు.
బీఆర్ఎస్లో లేని వర్గపోరును సృష్టించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాం గ్రెస్ పెద్దలు యువకులకు సముదాయించాల్సిందిపోయి ఉసిగొల్పడం సరికాదన్నారు. సమావేశంలో సీనియర్ నాయకుడు యా దాగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, మాజీ వైస్ ఎంపీపీలు హనుమంత్‌రెడ్డి, సిలువేరి జ్యోతీఆంజనేయులు, పీఏసీఎస్ డైరెక్టర్ భిక్షపతిరెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీశైలంయాదవ్, రాకేశ్‌రెడ్డి, కుంట లక్ష్మణ్, మామిడి నర్సారెడ్డి, శైలేందర్‌గౌడ్, రామకృష్ణారెడ్డి, షకిల్ పాల్గొన్నారు.