Harish Rao | జహీరాబాద్, మార్చి 20 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై రేవంత్ సర్కార్ అక్రమంగా వేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును సరైన ఆధారాలు లేవని గురువారం హైకోర్టు కొట్టి వేయడంతో జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాణసంచా కాల్చి , స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠం అని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వరకు ఎమ్మెల్యే హరీష్రావు పోరాటం ఆగదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్, పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్, మోహియుద్దీన్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండిమోహన్ సీనియర్, మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా సీనియర్ నాయకులు ప్రభు యాదవ్, తులసిదాస్ గుప్తా, కలీం, అలీమ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల, నాయకులు పరమేశ్వర్ పాటిల్, వెంకటేశం, ఆశమ్, పద్మజ, నరేష్ రెడ్డి, మహమ్మద్ అలీ, వహీద్, నరేష్ రెడ్డి, సందీప్ రాజ్, అక్షయ దేశ్పాండే, అలీ, నిఖిల్ ముదిరాజ్ విద్యార్థి విభాగం నాయకుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు