కంగ్టి, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు రావడంతో మంగళవారం మా జీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. శివాజీ చౌక్ వద్ద టపాసులు కాల్చి ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్‌స్కాం అని కుట్రకోణంతో పెట్టిన కేసులో దాదాపు 166 రోజులపాటు తీహార్ జైల్లో గడిపారని, సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడం ఆయా పార్టీలకు చెంప పెట్టులాంటివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, నాయకులు కృష్ణముదిరాజ్, పండరీనాథ్రావు, సత్యనారాయణ, సాయిలు, దత్తురావ్పాటిల్ పాల్గొన్నారు.
నారాయణఖేడ్, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తూ నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. రాజీవ్‌చౌక్ వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు నజీబ్, ముజామిల్, నవాబ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ను బలహీనపర్చాలనే ఎమ్మెల్సీ కవితపై నిరాధార అభియోగాలతో కేసులో ఇరికించారని, చివరికి న్యాయమే గెలిచిందన్నారు. నాయకులు అంబాదాస్, గోపాల్, లయక్, జగదీశ్వర్‌చారి, అంజాగౌడ్, నర్సింహులు, మల్గొండ, సంగారెడ్డి, మశ్చందర్, రాజు, దత్తు, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.
కోహీర్, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో మంగళవారం జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్ర చేశాయని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు బండిమోహన్, భారత జాగృతి అధ్యక్షురాలు అనసూయమ్మ, యాకూబ్, మంజుల, అబ్దుల్లా, రంగమ్మ, రవికిరణ్, రాకేశ్, తులసీదాస్గుప్తా, శివప్ప, పద్మజ, సత్యంముదిరాజ్, వెంకటేశంగుప్తా, నరేశ్‌రెడ్డి, గణేశ్, మధు, చంద్రయ్య, జాకీర్, శ్రీకాంత్, శివకాంత్ పాల్గొన్నారు.
రాయికోడ్, ఆగస్టు 27: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం సంతోషకరం అని తెలంగాణ మలి దశ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ మండల నాయకుడు కాశీ బస్వరాజుపాటిల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాయిపల్లి(సి)లో మాట్లాడుతూ.. త్వరలో జరిగే న్యాయ విచారణలో తప్పకుండా కవితమ్మ నిర్దోషిగా తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కోలేక పాలు పార్టీలు రాజకీయ కక్ష్య కట్టాయన్నారు.
వట్పల్లి, ఆగస్టు 27: జాగృతి అధ్యక్షురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయం. చేయని నేరానికి ఈడీ, సీబీఐలు కవితను ఆక్రమ కేసుల్లో ఇరికించి ఐదు నేలల పా టు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను తమ దారికి తెచ్చుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐని పావులుగా వాడుకుంటున్నది. సుప్రీంకోర్టు ఈ తప్పుడు కేసును కొట్టివేయలన్నారు. బండి సంజయ్ వ్యవహారం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది. కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బండి సంజయ్ వాఖ్యపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించాలి.
– చంటి క్రాంతి కిరణ్, అందోల్ మాజీ ఎమ్మెల్యే