BRS Leaders | చిలిపిచెడ్, సెప్టెంబర్ 3 : తెలంగాణను తెచ్చిన వ్యక్తిపై సీబీఐ విచారణ వేస్తారా..? కేసిఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమైతదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం నర్సాపూర్-జోగిపేట ప్రధాన రహదారిపై చిలిపిచేడ్ ప్రధాన కూడలిలో రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని.. బీడు వారిన భూములకు నీళ్లు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్లకు ఎత్తిపోయడం, 240 టీఎంసీల నీటి ఉపయోగం అని అన్నారు. ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం ఒక బ్యారేజీలోని 100 పిల్లర్లలో 3 పిల్లర్లు కుంగాయని, కుంగిన పిల్లర్లను బాగు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయని అన్నారు. కమిషన్ల పేరుతో ఎంక్వైరీలతో కాలయాపన చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నాలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలు మరిచి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్ని వర్గాలకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి,ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, గోపాల్ రెడ్డి, జైరాం రెడ్డి, సయ్యద్ ఉస్సేన్, నర్సింహారెడ్డి, యాదగిరి, విట్టల్, శంకర్, రాకేష్, వీరాస్వామి, జనార్దన్, సంగారెడ్డి, రాగిరి తదితరులు పాల్గొన్నారు.
RTC Buses | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
MLA Malla Reddy | తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు ముఖ్యం : ఎమ్మెల్యే మల్లారెడ్డి
Naxalites | 20 మంది మావోయిస్టులు లొంగుబాటు