జహీరాబాద్, మార్చి 15: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జహీరాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రధాన రోడ్డుపై ధర్నాను నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జగదీశ్‌రెడ్డిని సస్పెన్షన్ చేశారని ఆరోపించారు.
హామీలపై బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పడానికి దమ్ము, ధైర్యం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వెంటనే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని హెచ్చరించారు. ఆనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తర లించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు తట్టు నారాయణ, నర్సింహులు, వెంకటేశం, సంజీవ్‌రెడ్డి, నామ రవికిరణ్, భాస్కర్, యాకూబ్, నర్సింహగౌడ్, బండిమోహన్, మంజుల, అనుషమ్మ, రాకేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.