నిజాంపేట : మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన బండారి చిన్నక్క ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక నాయకుల ద్వారా మృతురాలు అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మౌరం రాజు, మండల ఉపాధ్యక్షుడు లచ్చపేట రాములు, మాజీ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, కాలనీవాసులు బండారి ఎల్లం, కుమార్,కిషన్, ఎల్ల స్వామి తిరుమల్, రాములు యాదగిరి తదితరులు ఉన్నారు.