దుబ్బాక, అక్టోబర్ 25 : దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగింది. రోజురోజుకూ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. నియోజకవర్గంలోని బీజేపీ, కాం గ్రెస్ పార్టీల నాయకులతో పాటు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువజన సంఘాల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. బుధవారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చీకోడ్ గ్రామానికి చెందిన యువజన సంఘాల నాయకులతోపాటు మరికొందరు బీఆర్ఎస్లో చేరారు. సుమారు 60 మంది బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భూస్థాపితం ఖాయమన్నారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో చీకోడు సర్పంచ్ తౌడ శ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడి పాల్గొన్నారు.
రాయపోల్, అక్టోబర్ 25 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీకి రాజీనామా చేసి మెదక ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు కొత్తపల్లి గ్రామానికి చెందిన మిద్దెల ప్రభాకర్, మన్నె రామచంద్రం, కల్లూరి గణేశ్, కిచుగారి అంజయ్య, ఎదుల్లా శ్రీనివాస్, నాంసాని దుర్గయ్య తెలిపారు. బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే అభివృద్ధి జరగదన్నారు. దుబ్బాక, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దాసరి బాల్నర్సు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కర్నాల సత్యనారాయణ, నాయకులు రాజరాం మధు, రాజనర్సు, ఎల్లం, నవీన్, మంద స్వామి, కృష్ణ, స్వామి పాల్గొన్నారు.
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), అక్టోబర్ 25 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలే దుబ్బాక గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడానికి దోహదం చేస్తాయని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన సుమారు 40మంది యువకులు బుధవారం ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కడువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భూంపల్లి ఉపసర్పంచ్ వడ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయ శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన విభాగం దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి పాపని సురేశ్‌గౌడ్, నాయకుడు చెన్నారెడ్డి పాల్గొన్నారు.
రాయపోల్, అక్టోబర్ 25 : బీఆర్ఎస్లో ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఉంటుందని మెదక ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ ఎంపీటీపీ కుమారుడు తెలంగాణ ఉద్యమకారుడు రాంపల్లి సతీశ్ బీజేపీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పార్టీలో ప్రతి కార్యకర్తను కంటికీ రెప్పలా కాపాడుకుంటామన్నారు. అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉండి, దుబ్బాకలో ప్రతిపక్షాలకు షాకు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
రాయపోల్, అక్టోబర్ 25 : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డి బారీ మోజార్టీతో గెలుపోందడం ఖాయమని రాయపోల్ మండల బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు. బుధవారం దుబ్బాకలో నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు సమావేశానికి వెళ్తున్న సందర్భంగా జడ్పీటీసీ యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ మం డల అధ్యక్షడు వెంకటేశ్వర శర్మ తదితరులు మాట్లాడుతూ నిత్యం దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపాలేరని, గత ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ప్రజలు నేడు బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో అత్మకమిటీ డైరెక్టర్ మురళి, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్‌చారి, మంజూర్, నవీన్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, ప్రవీణ్, స్వామి, రాజుగౌడ్, వెంకట్ స్వామి ఉన్నారు.