హామీలు తప్పిన కాంగ్రెసోళ్లను నిలదీయాలి
ఇచ్చిన హామీలు మర్చిన కాంగ్రెస్ ప్రచారానికి వస్తే చీపుర్లతో మహిళలు నిలదీయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం పటాన్‌చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి,
- హామీల సొమ్ము వస్తే కాంగ్రెస్‌కు… రాకుంటే బీఆర్ఎస్కే ఓటేయండి
- కాంగ్రెస్, బీజేపీలూ బీఆర్ఎస్ లేకుండా చేద్దామనుకుంటున్నాయి..
- ప్రజలు వాస్తవాలు గ్రహించి కారుగుర్తుకు ఓటేయాలి
- వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- బీజేపీ అభ్యర్థి చెల్లని రూపాయి.. కాంగ్రెస్ అభ్యర్థి డమ్మి
- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
- పటాన్చెరులో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం
పటాన్చెరు, ఏప్రిల్ 13: ఇచ్చిన హామీలు మర్చిన కాంగ్రెస్ ప్రచారానికి వస్తే చీపుర్లతో మహిళలు నిలదీయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం పటాన్‌చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌రెడ్డిలతో పాటు ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ సరిగ్గా అమలుకావడం లేదన్నారు. నమ్మితే నట్టేట ముంచిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలన్నారు. రూ.4వేల పింఛన్ అందిస్తామని 44 లక్షల మందిని మోసం చేశారని మండిపడ్డారు. రైతు భరోసాతో రూ.15వేల రైతులకు, రూ.12వేలు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఉలుకుపలుకూ లేదన్నారు.
రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరని, నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే మొసపోతారని హెచ్చరించారు. దుబ్బాకలో చెల్లని రూపాయి పటాన్చెరులో చెల్లుతుందా అన్నారు. రఘునందన్‌రావు అబద్ధాలు చెప్పి అప్పుడు గెలిచినా ఇప్పుడు సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డమ్మి అభ్యర్థి అని తెలిపారు. వెంకట్రామిరెడ్డి చదువుకున్న ఐఏఎస్ అధికారి అన్నారు. ప్రజల కోసం సేవచేసేందుకు రాజకీయాల్లో చేరారని, ఆయన్ని గెలిపించుకుంటే పార్లమెంటులో మనవాణిని వినిపిస్తారన్నారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను సమీక్షించి లక్ష మెజార్టీని పటాన్చెరులో బీఆర్ఎస్ సాధిస్తుందన్నారు.
ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా గెలిపిస్తే అద్భుతమైన ప్రగతిని చూపిస్తానన్నారు.పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి లక్ష మెజార్టీ ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు సరిచేసుకుని కారుగుర్తును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సఫాన్దేవ్, శంకర్‌యాదవ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్ యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు కొలన్ రోజాబాల్రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, ఈర్ల దేవానంద్, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజావెంకట్‌రెడ్డి, రాములు గౌడ్, గాయత్రీపాండు, అఫ్జల్, నగేశ్ యాదవ్, మెరాజ్‌ఖాన్, గోల్కొండ లక్ష్మణ్, రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

