సిద్దిపేట, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్/సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) : జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో మెతుకుసీమ ఆదివారం హోరెత్తింది. సిట్ విచారణకు బయలు దేరిన గులాబీబాస్ కేసీఆర్‌కు సబ్బండవర్గాలు మద్దతుగా నిలిచాయి. క్షక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారు దమననీతిని బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఎండగట్టారు.
ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఊరూవాడా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. నల్లజెండాలు చేబూని, రోడ్లపై బైఠాయించి.. నిరసనలు, ధర్నాలు, బైక్‌ర్యాలీలతో హోరెత్తించారు. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ సర్కారు తీరును బీఆర్ఎస్ శ్రేణులు ఖండించారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, చేగుంటలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లాకేంద్రంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, రామాయంపేటలో మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, అందోల్‌లో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి. హుస్నాబాద్‌లో మాజీ వొడితల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
సిట్ విచారణకు హాజరయ్యేందుకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు.

గౌరారం గ్రామస్తులు గుమ్మడికాయతో కేసీఆర్‌కు దిష్టితీశారు. రాజీవ్ రహదారి వెంట ప్రజలు కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. వాహనం నుంచి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వేలేటి రాధాకృష్ణ శర్మ, మాదాసు శ్రీనివాస్,
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వంటేరి యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు జహంగీర్ తదితరులు

మెదక్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

అందోల్‌లో బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్

ఇస్నాపూర్‌లో బైఠాయించిన ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్‌గౌడ్, సోమిరెడ్డి, నాయకులు

ఆర్సీపురంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

సంగారెడ్డిలోని చౌరస్తాలో చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న దృశ్యం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధి పోతారం(ఎస్)లో ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, నాయకులు

రామాయంపేటలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాత్రావు, పల్లె జితేందర్‌గౌడ్, నాయకుల ర్యాలీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, నాయకులు

సంగారెడ్డి జిల్లా బొల్లారంలో మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ నాయకుల ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు