కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు. మంగళవారం వట్‌పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
- జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్
వట్పల్లి, ఏప్రిల్ 30: తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ అన్నారు. మంగళవారం వట్‌పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్, మాజీఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కంటికి కనపడలేదన్నారు. ఉద్యమాలు జరుగుతుంటే పక్కదేశాల్లో తలదాచుకున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలకు మోసం చేసి గెలిచిందన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను ప్రశ్నించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, అందోల్ ఎన్నికల ఇన్చార్జి మాణిక్యం, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

