రాయపోల్, డిసెంబర్ 27: కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గొల్లపల్లి, ఉదయపూర్ గ్రామ ఉప సర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామ అధ్యక్షుడు కనకయ్య, వార్డు సభ్యులు సత్తయ్య, రవి, నాయకులు కుమార్, మహేశ్, కనకయ్య, స్వామి, నర్సింహులు శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్లో చేర గా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో బీజేపీ గ్రామ స్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకొని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి రైతులు, నిరుపేదలు, మహిళలు, యువత అండగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు ఆయన గుర్తుచేశారు. కాం గ్రెస్, బీజేపీల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. బీఆర్ఎస్లో చేరిన నాయకులందరూ గ్రామ స్థ్ధాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు హన్మండ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.