సిద్దిపేట/కొండాపూర్, జూలై 15: ప్రజాసంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రామాయంపేట బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మాపూర్ మాజీ సర్పంచుతోపాటు పలువురు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మంత్రి క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సమక్షంలో పార్టీ చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన అందిస్తూ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రామాయంపేట అభివృద్ధిని దశలవారీగా చేసుకుందామని, రోడ్డు, మురుగు కాల్వలకు నిధు లు కావాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కోరారని, రెండు రోజుల్లో రూ.20 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హామీనిచ్చారు. రామాయంపేటను ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ పట్లోళ్ల జయరాములు, సొల్కంపల్లి కృష్ణ, ఆంజనేయులు, పట్లోళ్ల లక్ష్మయ్య, సార శ్రీనివాస్‌గౌడ్, మన్నె మల్లేశం, సొల్కంపల్లి దుర్గయ్య, సంయోద్దిన్ ఉన్నారు.
బీఆర్ఎస్లో 200 మంది చేరిక
రామాయంపేట కోమటిపల్లి 2వ వార్డు కౌన్సిలర్ సుందర్‌సింగ్, 1వ వార్డు కౌన్సిలర్ వొద్దె స్వామి నేతృత్వంలో కాంగ్రెస్, బీజేపీలకు రాజీనామా చేసి దాదాపు 200 మంది మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు అమర్‌సింగ్, రవీందర్‌సింగ్, గణేశ్, సిద్ధి రాములు, గావు వివేకానంద, అశోక్, యాదగిరి, రాజు, భైరం అశోక్, శ్రీనివాస్, బాబు, ప్రశాంత్, ఆంజనేయులు, కృష్ణ, లక్ష్మ య్య, మల్లే శం, దుర్గయ్య, సంయుద్దీన్ ఉన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు విఠల్, మల్లాగౌడ్, సీనియర్ నాయకులు కూర్మిద్దీన్, ప్రకాశ్, విజయభాస్కర్‌రెడ్డి, పాండురంగం, సంతోశ్‌రెడ్డి, మోహన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి…
అందోల్, జూలై 15: అందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయా మండలాలకు చెందిన మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శనివారం అందోల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వట్పల్లి మండలం పోతులబొగుడకు చెందిన మజీ సర్పంచ్ సంగిశెట్టితోపాటు మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పుల్కల్ మండలం ఎస్.ఇటిక్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డితో పాటు పలువురు వార్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు
సిర్గాపూర్, జూలై 15: మండలంలోని పోచాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ జార మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు, ఎమ్మెల్యే తనయుడు రోషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో శనివారం చేరారు. ఈమేరకు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు జంగం బస్వరాజ్, పోల్కం విఠల్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు శంకర్, నాయకులు రవీందర్‌నాయక్, రాములు, సాయాగౌడ్, సత్యనారాయణగౌడ్, బస్వారాజ్, సాయి లు తదితరులు పాల్గొన్నారు.