Online Frauds | రామాయంపేట, జులై 02 : ఆన్లైన్ మోసాలకు ఎవ్వరూ కూడా గురికావద్దని రామాయంపేట ఎస్సై బాలరాజు పేర్కొన్నారు. బుధవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ మద్య కాలంలో ఆన్లైన్లో ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
ఫోన్లపై సరైన అవగాహన లేక ఎవరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే బ్యాంకు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఎక్కువ శాతం అమాయక ప్రజలు మోసాలకు గురవుతున్నారని అన్నారు. అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి ఏదైనా వివరాలడిగితే చెప్పొద్దన్నారు. ఫోన్లో మాయమాటలు చెప్పి మనుషులను లొంగదీసుకునే సైబర్ నేరగాళ్లు ఉన్నారని.. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఒకవేళ మీ ఫోన్లో నుండి డబ్బులు మాయమైతే వెంటనే తమకు 100కు కాల్ చేయాలన్నారు. లేకుంటే 1098కైనా కాల్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు మోసాల బారిన పడకుండా జాగ్రత్తలను పాటించాలన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య