ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం
సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రూ. కోట్లాది నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
- రూ.కోట్ల వ్యయంతో అధునాతన పరికరాలు ఏర్పాటు
- అన్ని రోగాలకు ఉచితంగా వైద్యం
- మాతా,శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
- ఎంసీహెచ్లో టిఫ్ఫా స్కానింగ్ యంత్రం ప్రారంభం
మెదక్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రూ. కోట్లాది నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశుసంరక్షణ దవాఖానలో ఏర్పాటు చేసిన టిఫ్ఫా సానింగ్ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనోమలీస్) యంత్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
గర్భం తో ఉన్న 18 నుంచి 21 వారాల మధ్య పిండం ఎదుగుదల, లోపాలను పరీక్షించుటకు ఈ సానింగ్ యంత్రం ఎంతో దోహ ద పడుతుందన్నారు. గర్భిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్ది అత్యున్నత స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు టిఫ్ఫా సానింగ్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, డాక్టర్ శివదయాళ్, డాక్టర్ల బృందం, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కౌన్సిలర్ ఆరే శ్రీనివాస్, జయరాజ్, వసంత్రాజ్, మున్సిపల్ మా జీ వైస్ చైర్మన్ రాగి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

