Nutrition | చిలిపిచెడ్, అక్టోబర్ 16 : ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని మండల ఐసీడీసీ సూపర్వైజర్ సంతోషిమాత తెలిపారు. గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు. స్థానికంగా దొరికే 37 రకాల ఆకుకూరల గురించి వివరించడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తయారు చేసి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యార్థినీ విద్యార్థులకు, పోషకాహారంపై వ్యాసరచన పోటీ, డ్రాయింగ్ పోటీ నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. చివరగా అందరితో పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ విట్టల్, చండూరు కాంప్లెక్స్, హెచ్ఎం రమేష్ చిలిపి చెడ్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ధనమూర్తి, ఆర్ఐలు సునీల్ చౌహన్, వెంకటేశం, ప్రతిమ, అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్