సిద్దిపేట, సెప్టెంబర్ 24 : ఊరూవాడ బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.ఆడబిడ్డలు తీరొక్క పులతో బతుకమ్మలను అంద ంగా పేర్చి, కూడళ్లు, ఆలయాలు, చెరువు కట్టలపైన ఆడిపాడి సందడి చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్నారు.
బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబురాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, కౌన్సిలర్ కొండం కవితాసంపత్రెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి, లకీరెడ్డి విజయ, సువర్ణ, సువర్ణ దేవి, 4వార్డు మహిళలు పాల్గొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించగా, మహిళా ఉద్యోగులు సందడి చేశారు.
-సంగారెడ్డి/సిద్దిపేట ఫొటోగ్రాఫర్లు