సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 25: సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడిపాడి సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వీపీ.రాజు తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బెనర్జీ, పీఆర్ఓ బొడ్డు రఘు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జయశ్రీ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, మహిళా ఉద్యోగులు, సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, మెప్మా అధికారులు రేణుక, జ్యోతి, ఆర్పీలు పాల్గొన్నారు. సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
-ఫొటోలు: స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 25
–