Bakrid Celebrations | రామాయంపేట, జూన్ 07 : మెదక్ జిల్లావ్యాప్తంగా రామాయంపేట పట్టణంతోపాటు పలు మండలాలు, గ్రామాల్లో బక్రీద్ పండుగ సంబురాలను ముస్లిం సోదరులు ఘనంగా జరిపారు. శనివారం రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అక్కన్నపేట, కాట్రియాల, లక్ష్మాపూర్, డి.ధర్మారం, వెంకటాపూర్ ఆర్ తదితర గ్రామాల్లో కులమతాల కతీతంగా హిందూ ముస్లింలు అలయ్ బలయ్ జరుపుకున్నారు.
రామాయంపేట పట్టణంలోని ఈద్గావద్దకు ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్తబట్టలు వేసుకుని ఈద్గా వద్ద వినిపిస్తున్న ఖవ్వాలి ని వీక్షించారు. ఖవ్వాలి అనంతరం ఒకరికొకరు కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రామాయంపేటలో పోలీస్ కానిస్టేబుళ్లకు ముస్లిం సోదరుల ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపి కౌగిలించుకున్నారు.
రామాయంపేట పట్టణంతోపాటు అన్ని గ్రామాలలో బక్రీద్ పండుగను జరిపారు. పట్టణంతోపాటు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు గట్టి నిఘాను కొనసాగించారు. ఎస్ఐ బాలరాజు ఈద్ఘా వద్ద ప్రార్దన అయ్యేంత వరకు అక్కడే ఉండి తమ సిబ్బందితో పటిష్టమైన చర్యలను చేపట్టారు.
ఘనంగా బక్రీద్ వేడుకలుః
చిలిపిచెడ్,జూన్ 7ఃమండలంలో ముస్లింలు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పండుగ పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని వస్త్రాలు ధరించి సుగుంధం పన్నీరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ ఈద్గా చేరుకుంటారు. అలాగే అక్కడ ప్రార్థనలు చేస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధతో నిర్వహింస్తారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ కో అప్షన్ షఫి,మాజీ జిల్లా రైతు సమన్వయ సభ్యుడు సయ్యాద్ ఉస్సేన్,మాజీ జిల్లా యూత్ సభ్యుడు మగ్ధుం,ఖాసీం,అఖిల్,ఆయా గ్రామాల ముస్లింలు పాల్గొన్నారు.
భక్తిశ్రద్దలతో బక్రీద్ వేడుకలు..వెల్దుర్తి, జూన్ 07. త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకలను వెల్దుర్తి, మాసాయిపేట మండలాల వ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ఉన్న మజీద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయగా, మత పెద్దలు భక్తిప్రవచనాలు చేశారు.
నిజాంపేట మసీద్‌లో బక్రీద్ పండుగ వేడుకలు
నిజాంపేట, జూన్7 :నిజాంపేట మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ వేడుకలను శనివారం జరుపుకున్నారు.నిజాంపేటలోని మసీద్ వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా నమాద్ చేసి అల్లా దయ అందరిపై ఉండాలని ప్రార్ధన చేశారు.కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఉన్నారు.
నార్సింగిలో ఘనంగా బక్రీద్ వేడుకలు
చేగుంట, జూన్07 : చేగుంట, నార్సింగి మండలాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.బక్రీద్ పండగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండగ జరుపుకోవడం జరుగుతుందని,ముస్లీం సోదరులు తెలిపారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు