Athimela Manik | పటాన్ చెరు, నవంబర్ 12 : ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం ఫ్యాక్టరీల్లో యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికులకు ఉందని, చట్ట విరుద్ధంగా కార్మికులను ఎట్లా తొలగిస్తారని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ సీఐటీయూ కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. బుధవారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న బిస్లరీ కార్మికులను తొలగించిన వారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు ఆందోళన నిర్వహించారు.
ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికులకు ఉందని, యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఎట్లా తొలగిస్తారని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సీఐటీయూ) కన్వీనర్ అతిమేల మాణిక్ అన్నారు. బిస్లరీ పరిశ్రమల్లో తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని ఐడీఏ పాశమైలారంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఇటీవల కార్మికులు ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.
చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నమని చెప్పినా ..
యూనియన్ పెట్టుకున్నందుకు యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తూ యూనియన్‌లో ఉండొద్దని, యూనియన్ను రద్దు చేసుకోవాలని 50 రూపాయల బాండ్ పేపర్‌పై సంతకాలు చేయాలని కార్మికుల మీద తీవ్ర ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. యాజమాన్యానికి, కార్మిక శాఖ అధికారులకు, పోలీసు అధికారులకు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నమని తెలియజేసినప్పటికీ కక్షపూరితంగా వేధింపులకు పాల్పడడం, తొలగించడం దుర్మార్గమని అన్నారు.
చట్టానికి విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ నాయకులు రాజు వెంకటేష్ శ్రీనివాస్ దుర్గయ్య బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు కోశాధికారి నవీన్ కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Read Also :
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం