ASHA Workers | ఝరాసంగం, మార్చి 17: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలగాణ ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక తహసీల్దార్ తిరుమల రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు జరిగిన ఆశా వర్కర్ల ధర్నా, చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ.. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, రిజిస్టర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు.
ఇప్పటివరకు హామీలను అమలు చేయకపోవడం సరికాదంటూ ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పని భారం తగ్గించే విధంగా జాబ్ చార్జ్ ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ప్రతి నెల రెండో తారీఖునే జీతాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా ఆశా వర్కర్ల ఇతర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా తీర్మానాలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆశావర్కర్లకు నెలకు రూ.18 వేలు జీతం, ఉద్యోగ భద్రత, యాక్సిడెంట్, సహజ మరణానికి ఎక్స్‌గ్రేషియా, హెల్త్ కార్డు, కొత్త ఆశల నియామకం, అర్హత కలిగిన ఆశలకు ప్రమోషన్, ప్రభుత్వ పథకాల వర్తింపు, పెండింగ్ ఇన్సెంటివ్స్‌పై డిమాండ్లను, సమస్యలను పరిష్కరించాలన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు