Army jawan | శివ్వంపేట, జూన్ 17 : శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని నేడు స్వగ్రామానికి తిరిగి విచ్చేశారు.
ఈ సందర్భంగా గ్రామ జడ్పీ హైస్కూల్, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ మధుసూదన్ రెడ్డిపై పూలు జల్లుతూ బ్యాండ్ మేళం, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మధుసూదన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న అమర జవాన్లకు నివాళి అర్పించారు.
భారత్ మాతాకి జై… వందేమాతరం అంటూ పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా