– పెన్‌పహాడ్ సర్పంచ్ ఒగ్గు రవి
పెన్‌పహాడ్, ఫిబ్రవరి 19 : పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలను పోషించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. జిల్లా కలెక్టర్‌గా అభిషేక్, డీఈఓగా ధరణి, డిప్యూటీ డీఈఓగా రిక్కి, ఎంఈఓగా ఆరాధన, హెచ్ఎంగా యశ్వంతి వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఒగ్గు రవి హాజరై మాట్లాడారు. తరగతి గదులే దేశ భవిష్యత్‌కు పునాదులు అన్నారు. నేటి విద్యార్థులే రేపటి నాయకులు, శాస్త్రవేత్తలు, పౌరులుగా ఎదిగే క్రమంలో అవసరమైన విజ్ఞానం, నైతిక విలువలు, విమర్శనాత్మక ఆలోచనను ఇక్కడే నేర్చుకుంటారన్నారు. నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాల ద్వారా తరగతి గది దేశ ప్రగతిని, కీర్తిని నిర్ణయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఎడవెల్లి సతీష్, హెచ్ఎం ఆర్.సునీత, వనజ రాంబాబు, ఇందు, అంగన్వాడీ టీచర్ ఊర్మిళ, ఆయా బంగారమ్మ పాల్గొన్నారు.