SL vs ZIM : ప్రపంచకప్‌లో జింబాబ్వే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఇంటికి పంపిన ఆఫ్రికా జట్టు మరో సంచలనం ఈసారి శ్రీలంకను చిత్తు చేసింది. నాకౌట్‌కు అజేయంగా దూసుకెళ్లాలనుకున్న ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. బౌలర్ల కృషిని నిలబెడుతూ.. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(63 నాటౌట్), కెప్టెన్ సికిందర్ రజా(45)లు చెలరేగిపోగా.., పొట్టి క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక ఛేదననతో రికార్డు నెలకొల్పింది. తద్వారా ఆసీస్‌పై విజయం గాలివాటం కాదని.. తమలో విజయకాంక్ష రగులుతూనే ఉందని పెద్ద జట్లకు హెచ్చరికలు పంపింది సికిందర్ రజా బృందం.
ప్రపంచకప్‌లో ఆడడమే కాదు అద్భుత విజయాలతో వార్తల్లో నిలుస్తోంది జింబాబ్వే. రెండో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 23 పరుగుల విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా జట్టు.. చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై పంచ్ విసిరింది. ఆల్‌రౌండ్ షోతో ఆతిథ్య జట్టును కట్టడి చేసిన జింబాబ్వే.. ఛేదనలోనూ దుమ్మరేపింది.
UNDEFEATED 🔥
Zimbabwe have won three games in the group stage for the first time at the men’s T20 World Cup! pic.twitter.com/VHwww1ahvc
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2026
ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్(63 నాటౌట్), మరుమణి(34)లు లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొని.. శుభారంభమిచ్చారు. దూకుడే మంత్రగా చెలరేగిన ఈ జోడీ పవర్ ప్లేలోనే 54 రన్స్ పిండుకుంది. ఎట్టకేలకు ఈ ద్వయాన్ని వెల్లలాగే విడదీసినా.. సికిందర్ రజా(45) వస్తూనే తుఫాన్‌లా ముంచెత్తాడు. ఎదుర్కొన్నది 26 బంతులో అయినా.. ఎడాపెడా బౌండరీలు బాదిన రజా.. లంక నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
Sikandar Raza’s brisk 45 made the difference as Zimbabwe beat Sri Lanka in the #T20WorldCup 2026 🙌
He wins the @aramco POTM🏅
📝: https://t.co/OdciG6vamS pic.twitter.com/aFRp2YyXce
— ICC (@ICC) February 19, 2026
అతడి విధ్వంసానికి హేమంత తెరదించగా.. ముసెకీవా(1) గాల్లోకి లేపిన బంతిని శనక డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. నాలుగో వికెట్ పడినా అప్పటికి జింబాబ్వే విజయానికి10 రన్స్ కావాలి. మున్యోంగా(8 నాటౌట్).. చివరిబంతికి సింగిల్ తీశాడు. చివరి ఓవర్లో 8 రన్స్ కొట్టాల్సిరాగా.. థీక్షణ వేసిన తొలి బంతికి మున్యోంగ మిడ్వికెట్లో సిక్సర్ బాదేశాడు. రెండో బతికి సింగిల్.. విక్టరీ రన్ కొట్టాడు. అంతే.. వికెట్ల 6 తేడాతో జింబాబ్వే జయభేరి మోగించింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(62) అర్ధ శతకంతో చెలరేగాడు. వేదికగా జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అర్ధ శతకంతో కదం తొక్కాడు. బ్లెస్సింగ్ ముజరబని(2-38), ఎవాన్స్(2-35) మిడిల్ ఓవర్లలో వికెట్ల వేటతో పరుగులు కట్టడి చేసినా.. పవన్ రత్ననాయకే(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడాడు. చివరి ఓవర్లో దునిత్ వెల్లలాగే(15 నాటౌట్) మూడు బౌండరీ బాదగా శ్రీలంక 178 స్కోర్ చేసింది.