Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్షన్లో తన కూతురు ఐశ్వర్య అర్జున్ను హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం సీతా పయనం (Seetha Payanam). కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించాడు. వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
అర్జున్ రాసుకున్న కథ, ఐశ్వర్య అర్జున్ యాక్టింగ్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తూ.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుకుంటున్నట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. అర్జున్ హోం బ్యానర్ శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పై తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.8.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండో వారం కూడా ఇదే రెస్పాన్స్‌తో మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు మరో హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఈ మూవీలో అర్జున్, ధ్రువ్ సార్జా, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో నటించారు.