Day care centres | మెదక్ రూరల్ జూలై 13: మెదక్ జిల్లాలో వృద్దుల కోసం బహుళ సేవల డే కేర్ కేంద్రాల ఏర్పాటు కోసం ఎన్జీఓలు దరఖాస్తులు చేసుకోవాలని మహిళా శిశు సంక్షేమ అధికారి హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా, శిశు,దివ్యాంగుల, వృద్దుల సంక్షేమ శాఖ, ఆధ్వర్యంలో డే కేర్ కేంద్రాలలో వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, వినోద కార్యక్రమాలు, కౌన్సెలింగ్, పోషకాహారం దినసరి జీవన సహాయ సేవలు అందించబడతాయి.
కనుక మెదక్ జిల్లాలో ప్రతి కేంద్రంలో 50 మంది వృద్దుల కోసం బహుళ సేవల డే కేర్ కేంద్రాల స్థాపనకు ఏర్పాటు చేయుటకు అర్హత గల స్వచ్చంద సంస్థల (ఎన్జీఓ లు) దరఖాస్తులను నేటి నుండి జూలై 17. సాయంత్రం 5.00 గంట లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నందు సమర్పించాలి. కావున అర్హులైన ఎన్జీఓ లు ఇట్టి సదావకాశా న్ని సద్వినియోగం చేసుకోగలరని అన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం