Self Employment Courses | మెదక్ మున్సిపాలిటీ, జులై 5 : మెదక్ జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ పొందడానికి 13వ బ్యాచ్ తరగతులు ప్రారంభం కానున్నాయని జిల్లా యువజన క్రీడాలధికారి దామోదర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతి, యువకులు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ప్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్స్, సీసీ టీవీ, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ వైరింగ్, మొబైల్ సర్వీసింగ్, మగ్గం వర్క్‌లలో 3 నెలల శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 7396313741 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు