Animal Census | మెదక్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టి మేషన్ (AITE) మెదక్ జిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా శాస్త్రీయంగా జంతువులను చేసేందుకు అధికారులు కృషి చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.
బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి జోజీతో కలిసి ఉదయం పోచారం అభయాఅరణ్యం కింద ఉన్న బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న జంతు గణనను పరిశీలించారు. మూడు రోజులపాటు మాంసాహార జంతువుల గణన తదనంతరం మరో మూడు రోజులపాటు శాకాహార జంతువుల గణన ఉంటుందని అదనపు కలెక్టర్ మేంచు నగేష్ తెలిపారు.
జిల్లా అటవీశాఖ అధికారి జోజీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఆరు రేంజ్‌లు, 98 బిట్లలో మాంసాహార జంతు గణన కొనసాగుతుందన్నారు. చిరుత పులులు ఎలుగుబంటి, నీల్గాయి, కొండ గొర్రె తదితర జంతువుల పాదముద్రలను విసర్జితాలు, జంతువుల వెంట్రుకలు, గోళ్లు, తదితరాలను ఏం స్క్రిప్ట్ యాప్‌లో నమోదు చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్ర రాజు, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ఐ లక్ష్మణ్, డీటీ చరణ్, ఎఫ్ఆర్ఓ మనోజ్ కుమార్, డీఆర్ఓ వేణు, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ramagiri : ‘పీజీ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలి’
Jharkhand: ఏనుగు బీభత్సం.. 22 మంది మృతి.. జార్ఖండ్‌లో ఎమర్జెన్సీ
Rachel McAdams | రాచెల్ మెక్‌ఆడమ్స్‌కు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు