MLA Manik Rao | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు ఆయా మండలకేంద్రాలు, గ్రామాల్లో సైతం అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాల వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు సైతం జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొనింటి మానిక్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, బీఆర్ఎస్ నాయకులు గుండప్ప ,విజయ్ కుమార్, నామ రవి కిరణ్, బండి మోహన్, మొయిజుద్దీన్, బీఆర్ఎస్వి నాయకులు రాకేష్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.