రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ‘మన ఊరు – మనబడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలోని మల్కాపూర్ పాఠశాలలో ‘మన ఊరు- మనబడి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, రహదారులను నిర్మిస్తూ భారీగా అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తు న్నదని ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేటలో ఆధునిక వ్యవసాయ పనిముట్లను అద్దెకు తీసుకెళ్లొచ్చని సూచించారు. దీంతో మహిళా సంఘాల అభివృద్ధి జరుగుతుందని మహిళలు కూడా ఆర్థికంగా ఎదుగుతారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీ పంతు లు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, పెద్దశంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీలు దత్తు, వీణాసుభాష్గౌడ్, దామోదర్, స్వప్నారాజేశ్వర్, సర్పంచ్ల ఫోరం మండ లాధ్యక్షుడు రాములు, సర్పంచ్‌లు ప్రకాశ్, నరేశ్, లక్ష్మణ్ నాయక్, నాయకులు మాణిక్‌రెడ్డి, శంకర్‌గౌడ్, శ్రీశైలం, సాయిలు, పున్నయ్య, ఐకేసీ ఏపీఎం గోపాల్, కో ఆర్డినేటర్సంపత్రెడ్డి, మహిళా సంఘాల బాధ్యులు పాల్గొన్నరు.
జడ్పీటీసీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్యెల్యే
పెద్దశంకరంపేటలో జడ్పీటీసీ విజయరామరాజు పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశా రు. ఎంపీపీ సమావేశ మందిరంలో జడ్పీటీసీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు జడ్పీటీసీకి శుభాకాంక్షలు తెలిపారు.