టేక్మాల్/చిలిపిచెడ్/హత్నూర/హుస్నాబాద్ టౌన్/రామాయంపేట, జూన్ 13: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులతో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో గుర్తించిన విద్యార్థులను బడిలో చేర్పించుకున్నారు. అంగన్వాడి కేంద్రాల్లో చేరిన వారిలో ఒకటవ తరగతి అర్హత కలిగిన వారిని ఆయా ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు. అలా ప్రవేశం పొందిన విద్యార్థులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
టేక్మాల్ మండల పరిధిలో
అలాగే బొడ్మట్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాధికారి సుజాత చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అర్హత, అనుభవం కలిగి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్, రెండు జతల యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పాఠశాలలో మెరుగైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మండల పరిధిలోని సర్మన్కుంట తండా, పోగుల వెంకటాపూర్, టేక్మాల్, తంపులూర్, బొడ్మట్‌పల్లి, టేక్మాల్, సాలోజిపల్లి, తదితర ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారులకు ప్రవేశం కల్పించారు. అనంతరం వారి చేత అక్షరాభ్యాసాన్ని చేయించారు.
చిలిపిచెడ్‌లో
చిలిపిచెడ్‌లో..
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని.. ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చిలిపి చెడ్ మండలం విద్యాధికారి శ్రీ పి విట్టల్ అన్నారు. మండలంలోని ప్రాథమిక, మరియు ,ఉన్నత పాఠశాలలో, విద్యార్థిని విద్యార్థులకు దుస్తులు పంపించేశారు. జగ్గంపేట ప్రాథమిక, ఉన్నతపాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ,పంపిణీ తో పాటు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కాగా, చండూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి హెచ్ఎం యూనిఫాం అందజేశారు.
హత్నూరలో..
రామాయంపేటలో..
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించినట్లు రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిధిలోని డి.ధర్మారం, కాట్రియాల, కోనాపూర్, అక్కన్నపేట, పర్వతాపూర్ తదితర గ్రామాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హత్నూరలో..
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ ఎం రమాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులంతా కలిసి కృషి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బడీడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులను కోరారు.
హుస్నాబాద్‌లో..
హుస్నాబాద్ టౌన్లో..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం వాస్దేవ రెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్న విద్య అనేది తప్పనిసరి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ విద్యాలయాలకు పంపించి విద్య పట్ల మక్కువ పెంచుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా 20 మంది నూతన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు.