నర్సాపూర్,మే22 : మండల పరిధిలోని మాడాపూర్, రెడ్డిపల్లి, గొల్లపల్లి గ్రామాలలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు-అన్నదాతలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిచారు.
ఈ సందర్భంగా ఎరువుల యాజమాన్యం, యూరియా వాడకం తగ్గించడం, మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం, వరి పత్తి పంట సాగులో తీసుకోవాల్సిన మెళకువలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.సుశీల, డా.రవీందర్, డా.అమీర్ పాషా, డా.అఫిఫా జహాన్, ఏఈవోలు రవివర్మ, లక్ష్మి, ఆత్మ ఏటీఎం హరీష్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.