మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా పొడిచిచంపారు. ఈ విషాదకర సంఘటన కౌడిపల్లి (దాబా)పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
మృతుడు పాపన్నపేట్ మండలం చీకోడ్ గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు(30)గా గుర్తించారు. తూప్రాన్ డీఎస్పి యాదగిరి రెడ్డి,సీఐ శ్రీధర్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.