న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ విపక్ష సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్‌పై ఈ నెల 9న చర్చించేందుకు లోక్‌సభ జాబితాలో లిస్టింగ్ చేశారు. కాగా, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు మల్లు రవి, మహ్మద్ జావేద్, సురేశ్ ప్రవేశపెట్టారు.
ప్రతిపక్ష నాయకులను సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని, విపక్ష మహిళా ఎంపీలపై అనుచిత ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు వారు పేర్కొన్నారు. విపక్షాల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ సభ్యుల హక్కులను స్పీకర్ కాలరాస్తున్నారని వారు ఆరోపించారు.