Crime news | బైక్‌ను ఢీకొట్టిన కారు..ఒకరి మృతి
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన పోలంపల్లి నర్సయ్య(65) అతని కూతురు మల్లమ్మ, మరో వ్యక్తి సంతోష్‌తో కలిసి బైక్‌పై కొంగోడు వైపు నుంచి దామరంచ వెళ్తున్నారు.
ఎదురుగా వెల్దుర్తి వైపు నుంచి వస్తున్న కొల్చారం గ్రామానికి చెందిన కటికె చందు కారు ఢీకొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడక్కడే మృతి చెందగా.. మల్లమ్మ, సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- car collided
- Crime news
- Died
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

