రామాయంపేట, ఫిబ్రవరి 23 : రామాయంపేట మండల వ్యాప్తంగా యాసంగిలో 42వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఇంచారి డివిజన్ ఏడీఏ.రాజ్ నారాయణ తెలిపారు. ఆదివారం నాడు ఆయన తన కార్యాలయం విలేకరులతో మాట్లాడారు.
రామాయంపేట మండలవ్యాప్తంగా యాసంగిలో 12 వేల ఎకరాల్లో రైతులు పంట వేశారని రాజ్ నారాయణ తెలిపారు. యాసంగిలో వరిపంటలు చీడపీడలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. వరి పంటకు ఏవైనా రోగాలు వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.