child | నర్సాపూర్ : ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఈ అమానవీయ ఘటన నర్సాపూర్ మండల పరిధిలో వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొండాపూర్ అటవీ ప్రాంతంలో నాలుగు నెలల మగ శిశువుని వదిలి వెళ్లారు.
వివరాల్లోకి వెళితే మెదక్ నుండి హైదరాబాద్కు కారులో వెళ్తున్న వాహనదారులు కొండాపూర్ అడవి ప్రాంతంలో ఆగి మూత్రం చేయడానికి రోడ్డు పక్కకు వెళ్లడం జరిగింది. అక్కడ సమీపంలో నుండి శిశువు ఏడుపులు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఓ మగ శిశువు కనబడ్డాడు. వెంటనే వారు 108కు కాల్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని శిశువుని తీసుకొని ప్రభుత్వ ఏరియా దవాఖానాకు చికిత్స నిమిత్తం తరలించారు.
అనంతరం పోలీసులు ఐసీడీఎస్ సిబ్బందికి శిశువును అప్పగించారు. మానవత్వం మంటగలిసే ఈ సంఘటనను చూసి పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..