మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి అన్ని పార్టీల నేతల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తేనే నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని 21వ వార్డు బీజేపీ కౌన్సిలర్ నిర్మలాభూషణంతో పాటు 60మంది బీజేపీ కార్యకర్తలు, హవేళీఘనపూర్ మండలంలోని ఫరీద్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు 80మంది, నిజాంపేటలో వంజరి సంఘం ఆధ్వర్యంలో 550 మంది బీఆర్ఎస్లో చేరారు.
వీరందరికీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో మహిళలు, రైతులు, పింఛన్‌దారులు, దివ్యాంగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని, అందరూ ఆదరించి
గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
– మెదక్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)
మెదక్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి రోజు రోజుకు అన్ని పార్టీల నాయకుల మద్దతు పెరుగుతున్నది. మెదక్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని 21వ వార్డు బీజేపీకి చెందిన కౌన్సిలర్ నిర్మల భూషణం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కౌన్సిలర్‌తోపాటు మరో 60 మంది బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో మహిళలు, రైతులు, పింఛన్‌దారులు, దివ్యాంగులు, ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా ఉన్నదన్నారు.
గతం లో ఏ ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టని మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మెదక్ ని యోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హవేళీఘనపూర్ మండలంలోని ఫరీద్‌పూర్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ సౌందర్య వినోద్, ఉప సర్పంచ్ వెంకటి, ఎంపీటీసీ సభ్యులు రా జయ్య, పిఎస్హెచ్ చైర్మన్ బ్రహ్మం, నాయకులు సిద్దు, బాబు, బ్రహ్మం, బాలయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.
నిజాంపేట, అక్టోబర్16: బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిజాంపేట వంజరి సంఘంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలపై నిర్వహించిన సమావేశానికి ఎన్నికల జిల్లా ఇన్చార్జి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, శశిధర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. 550 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ టికెట్లు అమ్ముకునే పార్టీగా పేరు పొందిందన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నిజాంపేట మండల వ్యాప్తంగా 550 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు అనూష, చంద్రవర్ధిని, ప్రీతి, అరుణ్‌కుమార్, గేమ్‌సింగ్, నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు లహరి, బాపురెడ్డి, సురేశ్, భాగ్యలక్ష్మి, నిజాంపేట, కల్వకుంట పీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, అందె కొండల్‌రెడ్డి, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్లు రవి, వెంకటేశం, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అబ్దుల్అజీజ్, మాజీ ఎంపీపీ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిష్టారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.