మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - May 12, 2020 , 00:23:03

గజ్వేల్‌లో లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

గజ్వేల్‌లో లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

వర్గల్‌/గజ్వేల్‌అర్బన్‌: గజ్వేల్‌ నియోజకవర్గంలో లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేశామని ప్రతిపక్షాలు అవగాహన లేకుండా చేస్తున్న విమర్శలను మానుకోవాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం వర్గల్‌ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గజ్వేల్‌లో పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తూ రైతులకు సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా ఎరువులు, విత్తనాలు రైతులందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.


logo